'నీ కొడుకు గంజాయి బ్యాచ్ కాదా!- నార్కో టెస్టుకు సిద్ధమా?- అబద్దమైతే మచిలీపట్నం ఖాళీ చేస్తా' - Jana Sena Leader Courier Srinu - JANA SENA LEADER COURIER SRINU
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 11:55 AM IST
Jana Sena Leader Courier Srinu Comment on Perni Nani and his Son : మాజీ మంత్రి పేర్ని నాని, అతని తనయుడు కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను ఘాటు విమర్శలు చేశారు. పేర్ని నాని ఓ అవినీతిపరుడని పేర్ని కిట్టు ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉంటారని ఆరోపించారు. పేర్ని నాని చేసిన ప్రతి అవినీతికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పిన విషయాలు అబద్ధమని నిరూపిస్తే మచిలీపట్నం నుంచి వెళ్లిపోతానని శ్రీను సవాల్ విసిరారు.
తాను వైఎస్సార్సీపీ ఉన్నంత కాలం అవసరార్థం వాడుకుని, అక్రమాలను ప్రశ్నిస్తున్నాన్న కారణంతో తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని కొరియర్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీని వీడి జనసేనలో చేరానన్న కక్షతో పోలీసులను అడ్డుపెట్టుకుని తనపై రౌడీషీట్ ఒపెన్ చేయించారని మండిపడ్డారు. తన కార్యాలయం పైకి గంజాయి బ్యాచ్‌ను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు కూడా నమోదు చేయనీయలేదంటూ తెలిపారు. తనకు ఉన్న బార్, లారీ వ్యాపారాలకు సంబంధించి కిట్టూకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలని బెదిరించారని ఆరోపించారు.