ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగ్గయ్యపేట మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం - వైఎస్సార్సీపీని వీడిన చైర్మన్​, కౌన్సిలర్లు - Municipal Chairman Joined In TDP - MUNICIPAL CHAIRMAN JOINED IN TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 3:29 PM IST

Jaggayapet Municipal Chairman Joined  In TDP : జగ్గయ్యపేట మున్సిపాలిటీ తెలుగుదేశం వశమైంది. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాఘవేంద్ర, ముగ్గురు కౌన్సిలర్లు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి లోకేష్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుమందు తెలుగుదేశానికి 14 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ చేరికలతో 18కి చేరింది. వైఎస్సార్సీపీ బలం 13కి పడిపోయింది. వైఎస్సార్సీపీ విధానాలు నచ్చకే టీడీపీలోకి చేరామని మున్సిపల్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్లు తెలిపారు.
జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయనతోపాటు పలువురు వార్డు కౌన్సిలర్లు పార్టీలో చేరారు. 7వ వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు, 31వ వార్డు కౌన్సిలర్ గింజుపల్లి వెంకట్రావు, కుమారుడు కృష్ణ, 23వ వార్డు కౌన్సిలర్ డి.రమాదేవి దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీ వీడతారనే ప్రచారం ఉందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తెలిపారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయంగా పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details