విశాఖలో గంజాయి నిరోధం, రౌడీయిజాన్ని నిర్మూలిస్తాం: సీపీ శంఖ బ్రత బాగ్చి - Visakha CP interview on ganja - VISAKHA CP INTERVIEW ON GANJA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 9, 2024, 1:43 PM IST
Vishakha CP Sanka Brata Bagchi Interview : విశాఖ నగరంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా యంత్రాంగం పని చేస్తుందని పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి తెలిపారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా గంజాయి నిరోధం, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించారు. సైబర్ క్రైంలో ఇప్పటి వరకు సీజ్ అయిన రూ. 12 కోట్ల మొత్తం తిరిగి బాధితులకు అందుబాటులోకి తెచ్చే విధంగా న్యాయపరమైన చర్యలు చేపట్టినట్టు వివరించారు.
యువతకు కౌన్సిలింగ్ ఇస్తాం : విశాఖ నగరంలో వెయ్యికిపైగా సీసీ కెమెరాలు పని చేయడం లేదని గుర్తించామని, వాటన్నింటిని పని చేసేలా తీర్చిదిద్దడమే కాకుండా, ఇంకా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించి ఏర్పాటు చేయనున్నట్టు చర్యలు చేపట్టామని తెలిపారు. గంజాయి సేవనానికి అలవాటు పడ్డ యువతకు కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్‌లో చికిత్స ద్వారా తిరిగి గాడిలో పెట్టడతామని, ముఠాల కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీల ద్వారా నిరోధించడం సాధ్యమని చెబుతున్న విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చితో ఈ టీవీ భారత్ ముఖాముఖి.