ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్డడీలో హింసించారు: న్యాయవాది లక్ష్మీనారాయణ - Interview with Lakshminarayana - INTERVIEW WITH LAKSHMINARAYANA

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 6:49 PM IST

Interview with High Court Lawyer Lakshminarayana: రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్డడీలో హింసించి హత్యాయత్నానికి పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసేందుకు చట్టం అనుమతిస్తోందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్​తో పాటు సీఐడీ ఉన్నతాధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ నేరాలు చేసినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. మూడేళ్ల తర్వాతైన ఈ ఘటనపై కేసు నమోదు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమని చట్టం నుంచి నిందితులు తప్పించుకోలేరని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

Case Registered on Jagan : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌పై కేసు నమోదయ్యింది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాహత్నం చేశారని ఫిర్యాదు చేశారు. సెక్షన్‌ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details