ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రతినిధులకే ఓటేస్తాం- తొలిసారి ఓటుహక్కు పొందిన యువత మనోగతం - INTERVIEW WITH NEW VOTERS - INTERVIEW WITH NEW VOTERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 5:16 PM IST

Interview with First Time Voters in Guntur: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో కీలకం. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఓటుతో సమర్ధులైన నాయకుల్ని నిజాయతీగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్య పాలనలో ప్రగతి సాధ్యమని గుంటూరు జిల్లా జేకేసీ కళాశాల యువ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన అవకాశం మాత్రమే కాదని, ఓటు మన భవిష్యత్​ను నిర్ణయించే పెద్ద పరీక్షని పేర్కొన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును స్వదినియోగం చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మన కులం, మన వర్గం, మన మతం అని చూడకుండా కేవలం అభ్యర్థి గత ఐదు సంవత్సరాలలో చేసిన మంచి, సామర్ధ్యాన్ని గుర్తించి ఓటు వేయాలని సూచిస్తున్నారు. ఏ నాయకుడైతే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని అనుకుంటున్నారో వారినే గెలిపించుకోవాలని చెబుతున్నారు. సంక్షేమం పాలిట ప్రజలకు డబ్బులు ఎరగా వేసే పాలకులకు కాకుండా ప్రజల ఉన్నతికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే ఉత్తమ ప్రజాప్రతినిధులకే తమ ఓటు అంటున్న యువ ఓటర్లతో ఈటీవీ ముఖామఖి.

ABOUT THE AUTHOR

...view details