ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆర్టీసీ బస్సు కిందపడి ఇంటర్‌ విద్యార్థి మృతి- వీడియో వైరల్ - Inter Student Died Falling Down Bus - INTER STUDENT DIED FALLING DOWN BUS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 7:18 PM IST

Inter Student Dies After Falling Down from Bus in Hyderabad: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు దిగుతుండగా ఇంటర్‌ విద్యార్థి కాలు జారి కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి మీద నుంచి బస్సు వెళ్లింది. వెంటనే గమనించిన స్థానికులు వెంటనే బస్సును నిలిపివేసి యువతి దగ్గరకు వెళ్లారు. అంబులెన్స్‌ను రప్పించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్‌ నగరంలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. బస్సు ఆగిన తర్వాత దిగాలని ఆర్టీసీ అధికారులు ఎప్పుడు ప్రయాణికులకు సూచిస్తూనే ఉన్నారు. అయినా కొందరు తొందరపాటుతో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details