ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Parliament Budget Session Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 2:41 PM IST

Updated : Jul 22, 2024, 6:03 PM IST

Parliament Budget Session Live : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం (మోదీ సర్కార్​ 3.0) మూడోసారి కొలువుదీరిన తర్వాత, తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. నేడు పార్లమెంట్​ ముందు భారత ఆర్థిక సర్వేను ఉంచనున్నారు. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్​కు సంబంధించిన 2024 బడ్జెట్ కూడా జూలై 23నే పార్లమెంట్​కు సమర్పించనున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ సెషన్​లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 6 బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా వీటిపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 22, 2024, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details