'పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం తగదు'- రైల్వే ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం - Income Tax Awareness For Employees - INCOME TAX AWARENESS FOR EMPLOYEES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 7:28 PM IST
Income Tax Awareness Program For Railway Employees in Vijayawada: ఆదాయపు పన్నును ప్రతి ఒక్కరూ చెల్లించి దేశ ప్రగతి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆదాయపు పన్నుశాఖ జాయింట్ కమిషనర్ అభినయ కోరారు. విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ఉద్యోగులు ఐటీ రిటర్న్ సరిగ్గా చెల్లించట్లేదని ఇటీవల అధ్యయనంలో తేలిందన్నారు. సకాలంలో ఆదాయపు పన్ను చెల్లించకపోతే పెనాల్టీ సహా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని అభినయ కోరారు.
పన్నులు చెల్లించకపోతే ఎదుర్కొవాల్సిన ఇబ్బందులను ఆమె వివరించారు. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని విజయవాడ రైల్వే డీఆర్ నరేంద్ర పాటిల్ తెలిపారు. దేశ ప్రగతి, అభివృద్ధికి పన్నుల చెల్లింపులు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పలువురు ఉద్యోగులు సకాలంలో పన్ను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నరేంద్ర పాటిల్ తెలిపారు. ఐటీ రిటర్న్స్‌ను ప్రస్తుతం చాలా సులభతరం చేశారని ప్రతి ఒక్కరూ సకాలంలో ఆదాయపు పన్నును చెల్లించాలని నరేంద్ర పాటిల్ కోరారు.