తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఉప్పల్​ వద్ద నల్లచెరువు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభోత్సవం - ప్రత్యక్షప్రసారం - Nallacheruvu Sewage Treatment Plant

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 6:25 PM IST

Inauguration of Nallacheruvu Sewage Treatment Plant at Uppal : సీఎం రేవంత్​ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం హెచ్​ఎండీసీ కారిడార్​కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్​, శుక్రవారం పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నేడు సికింద్రాబాద్​లోని డబుల్​ ఎలివేటెడ్​ కారిడార్​కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎల్బీనగర్​ వద్ద బైరామల్​గూడ కూడలిలో పై వంతెనను ప్రారంభించారు. ఇప్పుడు ఉప్పల్​ వద్ద నల్ల చెరువు సీవేజీ ట్రీట్​మెట్​ ప్లాంట్​ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్​ డబుల్​ ఎలివేటెడ్​ కారిడార్​ను రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్​ నిర్మిస్తున్నారు. ఇందులో అండర్​గ్రౌండ్​ టన్నెల్​ 0.6 కిలోమీటర్లుగా ఉండగా, ఇందులో మొత్తం 131 స్తంభాలతో ఆరు వరుసల్లో ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మించనున్నారు. మరోవైపు ఎల్బీనగర్​లోని బైరామల్​గూడ కూడలిలో రూ.148.5 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్​ను నిర్మించారు. ఇప్పుడు ఉప్పల్​ వద్ద నల్లచెరువు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details