రెడ్ అలర్ట్ టూ శ్రీకాకుళం- 'ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి' - IMD Issues Red Alert To srikakulam - IMD ISSUES RED ALERT TO SRIKAKULAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 11:05 AM IST
IMD Issues Red Alert To Srikakulam : వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి, వంశధార, నాగావళి, మహేంద్ర తనయ నదులు పొంగిపొర్లుతున్నాయి. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఏ సమస్య ఎదురైనా 08942 240557 నంబరుకు ఫోన్ లేదా cosklmsupdtd@gmail.com కు మెయిల్ చేయొచ్చు. విద్యుత్తు ఇబ్బందులకు సంబంధించి 94906 10053, 94906 12800 నంబర్లకు ఫోన్ చేస్తే ఏఈలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. సాయం కావల్సినవారు శ్రీకాకుళం డివిజన్: 94960 12633 టెక్కలి: 70958 75259, పలాస: 73825 85630 కంట్రోల్ రూంలకు సమాచారమివ్వాలి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వినాయక మండపాల వద్ద నిర్వాహకులు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాల గురించి మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేశ్ అందిస్తారు.