ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న తెల్లరాయి మాఫియా - నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:35 PM IST

Illegal White Stone Mining in Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్​ అడ్డు అదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్రమ మైనింగ్​పై ప్రతిపక్షాలు పోరు సాగిస్తున్నా, అక్రమ మైనింగ్ మరిగిన వైసీపీ నేతలు అధికారుల అండదండతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి తరుణంలోనే జిల్లాలో మరోచోట మైనింగ్​కు తెరలేపారు. జిల్లాలోని సహజ వనరులను దోపిడిదారులు దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లరాయి మాఫియా నేతల అండదండతో   రెచ్చిపోయింది. మర్రిపాడు మండలం చిలకపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో బోర్లు వేసి మరి డిటోనేటర్లు, జెలిటన్ స్టిక్స్​తో భారీ పేలుళ్లకు సిద్ధం చేస్తున్నారు. తెల్లరాయి కోసం బ్లాస్టింగ్​లకు పాల్పడతారేమో అని స్థానికులు వణికిపోతున్నారు. దీంతో అక్రమ తవ్వకాలను అక్కడి నివాసితులు అడ్డుకున్నారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి మనుషులమంటూ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details