ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వ అణచివేతపై ప్రశ్నించేందుకు 'మహా సంకల్ప సభ' - విశ్రాంత ఐఏఎస్​​ విజయకుమార్

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:55 PM IST

IAS Vijayakumar Holding Public Meeting Against Govt: అధిక జన మహాసంకల్ప సభ (Adhika janula Mahasankalpa Sabha) పేరుతో ఈనెల 14న గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న బైబిల్ గ్రౌండ్స్​లో విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 26 జిల్లాల నుంచి సుమారు 15వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు పెద్ద ఎత్తున ఆహ్వానించామని విజయ కుమార్ అనుచరులు తెలిపారు. 

గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి సాయం అందని పేద, దళిత వర్గాలంతా ఈ సభకు హాజరై తమ గళం వినిపించ వచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ అణచివేతపై ప్రశ్నించేందుకు అంతా ముందుకు రావాలని కోరారు. ఐక్యతా విజయపథం యాత్ర (Aikyatha Vijaypath Yatra)లో భాగంగా 2,700 కిలోమీటర్ల మేర నడిచి పేదల నుంచి అర్జీలు స్వీకరించామని తెలిపారు. కాగా రాష్ట్రంలో సమస్యలపై అధ్యయనం కోసం గతేడాది జులైలో తడ నుంచి తూర్పుగోదావరి జిల్లా తుని వరకు పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుంచి సుమారు ఆరు వేలకుపైగా వినతులు స్వీకరించారు. వీటిపై సమగ్ర అధ్యయనం చేశారని, తమ భవిష్యత్ కార్యాచరణను సభలో విజయ్ కుమార్ వెల్లడిస్తారని ఆయన వర్గీయులు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details