తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​ వీడియో - పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌ - అలాగే తోసుకుంటూ వెళ్లిన ర్యాపిడో రైడర్ - Rapido a Customer Sitting on Scooty

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 11:29 AM IST

Hyderabad Rapido Viral Video : సాధారణంగా ప్రజలు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే సొంత వాహనం లేదా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. అవి కూడా అందుబాటులో లేకపోతే ఆటో, క్యాబ్, ర్యాపిడో, ఇలా ఏది అందుబాటులో ఉంటే అందులో వెళ్తారు. ప్రయాణం సులభంగా సాగడానికి, గమ్యస్థానానికి తొందరగా చేరుకోవడానికి ప్రయాణికులు వీటిని ఆశ్రయించడం మాములైపోయింది. నగరాల్లో అయితే కార్యాలయాలు, వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం తప్పనిసరి అలవాటుగా మారింది.

Rapido Driver Carrying a Customer Sitting on Scooty : తాజాగా హైదరాబాద్​లో ఓ వ్యక్తి  తన గమ్యస్థానాన్ని చేరుకునేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాడు. కొద్దిసేపు ప్రయాణం సజావుగా సాగింది. ఇంతలో తాను ప్రయాణిస్తున్న స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ర్యాపిడో రైడర్, సదరు వ్యక్తితో దగ్గరలో ఉన్న పెట్రోల్ ​బంక్ వరకూ నడుచుకొని రావాలని కోరాడు. దీనికి కస్టమర్ ససేమిరా అనడంతో చేసేదేం లేక స్కూటీపై అతన్ని కూర్చోబెట్టుకుని​ పెట్రోల్ ​బంక్ వరకూ తీసుకెళ్లాడు. దీనిని గమనించిన కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details