వివాహేతర సంబంధం - భార్యను చంపి పొలంలో పడేసిన భర్త - Husband killed his wife - HUSBAND KILLED HIS WIFE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 9:29 PM IST
Husband Killed his Wife in Palnadu District: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో జరిగింది. నరసరావుపేట గ్రామీణ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బెల్లంకొండ మండలం వన్నాయపాలెంకు చెందిన త్రివేణి (35)కి వివాహేతర సంబంధం కారణంతో భర్తతో విబేధాలు వచ్చి పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే ఇటీవల హాస్పిటల్లో చూపించుకునేందుకు ఇద్దరూ తమ గ్రామం నుంచి నరసరావుపేటకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దారిలో ద్విచక్ర వాహనం ఆపి భార్య త్రివేణిని భర్త మురళి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడని సీఐ వివరించారు. మృతురాలు త్రివేణిది బెల్లంకొండ మండలం వన్నాయపాలెం. మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. భార్యను హత్య చేసిన అనంతరం ద్విచక్రవాహనంపై పారిపోతుండగా భర్త మురళీ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు. మురళీని నరసరావుపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఐ వివరించారు.