ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీటు కోసం బ్యాగ్ ​- బస్సు ఎక్కేసరికి నగదు, బంగారం మాయం - Cash 20 Lakh Worth Gold Stolen - CASH 20 LAKH WORTH GOLD STOLEN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 9:25 AM IST

Huge Robbery in Narasapuram 11 Lakhs Cash 20 Lakh Worth Gold Stolen : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరులో బంగారు వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేసే సింగ్ సోమవారం నరసాపురం వచ్చారు. బంగారు వర్తకుల వద్ద ఆభరణాల తయారీకి ఆర్డర్లు, వారి వద్ద నగదు వసూలు చేసి సాయంత్రం సమయంలో తిరిగి భీమవరం వెళ్లేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్​కు వచ్చారు. ఆ సమయంలో భీమవరం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బస్సు రద్దీగా ఉంది. దీంతో సింగ్ తన వద్ద ఉన్న బ్యాగ్​ను కిటికీ నుంచి సీటులోకి వేశారు. రద్దీ తగ్గిన అనంతరం బస్సులోకి వెళ్లి సీటులో చూసేసరికి బ్యాగ్ లేదు. 

అందులో సుమారు రూ.11 లక్షలు నగదు, సుమారు రూ.20 లక్షల విలువల గల 400 గ్రాముల బంగారం ఉందని తెలిపారు. ఘటనకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పట్టణ సీఐ కేఏ స్వామి తెలిపారు. సింగ్ వద్ద ఉన్న నగదు, బంగారం ఎంత మొత్తం ఉందని నిర్ధారణ కాలేదని, యజమానికి కూడా సమాచారం అందించామని బులియన్ వర్తకసంఘ సభ్యులు తెలిపారు. సింగ్ పని చేస్తున్న దుకాణ యజమాని మంగళవారం ఉదయం ఇక్కడకు వస్తారని అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details