ఒకే పాదుకు వందలాది రాఖీ పూలు - Huge Rakhi Flowers in Manyam - HUGE RAKHI FLOWERS IN MANYAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 1:26 PM IST
Huge Rakhi Flowers in Manyam District : అల్లూరి జిల్లా రాజవొమ్మంగిలో వెంకటేశ్వరరావు ఇంటి అవరణలో పెంచుతున్న తీగ జాతికి చెందిన మొక్క రాఖీ పాదుకు ఏకంగా 289 పుష్పాలు పూశాయి. సోమవారం ఇదే పాదుకు 457 పుష్పాలు ఫూశాయి. ఐదేళ్లగా పెంచుతున్న ఈ పాదుతోపాటు పుష్పాలను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు అధిక సంఖ్యలో వచ్చి, వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ పువ్వులను శివ పూజకు ఉపయోగిస్తున్నామని వెంకటేశ్వరరావు తెలిపారు.
పువ్వులంటే ఇష్టం ఉండని వారుండరు. రంగురంగుల పుష్పాలు, సువాసన వెదజల్లుతూ అందర్నీ ఆకర్షిస్తాయి. ఎండాకాలంలో మల్లెపూలు విరివిగా పూస్తాయి. అయితే కాలాల్ని బట్టి వివిధ రకాల పువ్వులు పూస్తాయి. కొన్ని పాదులు ఏడాదికి ఒకే పుష్పాన్నిస్తే మరికొన్ని కాలాలలో సంబంధం లేకుండా పుష్కలంగా పూస్తాయి. పూలు ఆడవాళ్ల సిగలో ఒదిగిపోయి అతివలకు మరింత అందాన్ని అద్దుతాయి. అదే విధంగా దైవారధనలో పూలది కీలక పాత్ర. అటువంటిది అరుదుగా దొరికే రాఖీ పూలు ఒకేసారి వందల సంఖ్యలో వికసించడంతో చుట్టుపక్కల జనాలకు ఈ సుందర దృశ్యం కనువిందు అయ్యింది.