ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గంజాయి అదుపుకు ప్రత్యేక టాస్క్​ఫోర్స్- మూడు నెలల కార్యాచరణ ప్రణాళికలు: హోం మంత్రి అనిత - Ganja Issu in AP - GANJA ISSU IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 10:22 PM IST

Home Minister Vangalapudi Anitha Comments: రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విశాఖ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంకా కొంతమంది పోలీసులలో వైసీపీ మూలాలు ఉంటే విడిచిపెట్టాలని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే దృక్పథంతో ఉండాలని అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్చి మహిళా పోలీస్ స్టేషన్లుగా పెడతామన్నారు. పోలీస్ శాఖలో చాలా భారీ స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రాన్ని ఒక గంజాయి డ్రగ్బ్ హబ్​గా మార్చేశారని ఆరోపించారు. కనీసం పోలీస్ స్టేషన్ నిర్వహణ ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. గంజాయిని అణచివేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క విశాఖలోనే గంజాయి అక్రమ రవాణా చేస్తూ 1252 మంది మీద కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రమంతా కలిపినా కూడా 300 మంది మాత్రమే ఉన్నారన్నారు. చింతపల్లి ,మాడుగుల, ఇతర ఏజెన్సీ ఒడిస్సా నుంచి రవాణా అవుతుంటే, కేవలం మూడు చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయని అందుకే యథేచ్ఛగా గంజాయి నగరంలోకి వస్తోందన్నారు. గంజాయి నివారణ దిశగా ప్రజా సహకారం కూడా కావాలని మంత్రి వంగలపూడి అనిత  చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details