ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల్లో జరిగిన అల్లర్లపై హైకోర్టులో పిటిషన్- గొడవలు అరికట్టాలని సీఎస్‌, డీజీపీ, సీఈవోకు ఆదేశాలు - High Court Orders to Stop Clashes - HIGH COURT ORDERS TO STOP CLASHES

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 10:49 PM IST

High Court Orders to Stop Clashes: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసినా పలు జిల్లాల్లో అల్లర్లు, దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో అల్లర్ల విషయమై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. అల్లర్లు జరగకుండా సీఎస్‌, డీజీపీని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత కూడా దాడులు ఆగట్లేదని కోర్టుకు తెలిపారు. దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

పల్నాడు జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్‌ అమలు చేశామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం గొడవలు అరికట్టాలని రాష్ట్ర సీఎస్‌, డీజీపీ, సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పోలింగ్​ రోజున రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మహిళలు, సామన్య పౌరులు సైతం గాయపడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం అల్లర్లలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నత అధికారులదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పును వెలువరించింది. 

ABOUT THE AUTHOR

...view details