ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ స్టీల్‌ప్లాంట్​పై యథాతథ స్థితి కొనసాగించండి- కేంద్రానికి హైకోర్టు ఆదేశం - HC judgment on Visakha Steel Plant

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 9:23 PM IST

High Court judgment on Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ తదితరులు కొద్దిరోజుల కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాంపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. 

Vizag Steel plant Judgment : విచారణ సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూములుకాని, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ASG) నరసింహశర్మ హైకోర్టుకు తెలిపారు. అలాగే కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నపెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని కోర్టుకు తెలిపారు. అదేవిధంగా కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. ఏఎస్​జీ చెప్పిన అన్ని వివరాలను హైకోర్టు నమోదు చేసుకుని తదుపరి విచారణను జూన్‌ 19కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details