ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వారి గురించి తెలియజేసేదే 'ఆపరేషన్ వాలెంటైన్': హీరో వరుణ్ తేజ్ - ఆపరేషన్ వాలెంటైన్ బృందం సందడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 7:44 PM IST

Hero Varun Tej On Operation Valentine Movie: ఎయిర్​ఫోర్స్​ నేపథ్యంగా సాగే 'ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం ప్రేక్షకులను తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని ప్రముఖ కథానాయకుడు వరుణ్ తేజ్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం బృందం (Operation Valentine Team) సందడి చేసింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నామని పేర్కొన్నారు.

తెలుగులో ఇప్పటివరకు ఎయిర్ ఫోర్స్ నేపథ్యంగా(Air Force Based) సినిమా రాలేదని ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఈ లోటు తీర్చనుందని వరుణ్ తేజ్ చెప్పారు. పుల్వామాలో ఉగ్రదాడి, అనంతరం ప్రతీకారంగా భారత్ వాయుసేన జరిపిన దాడులు, దేశభక్తి నేపథ్యంగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం సాగనుందని చెప్పారు. కొన్ని సినిమాలు ప్లాన్ చేస్తే జరగవని కంచె చిత్రం తరువాత ఇలాంటి సినిమా రావడం గర్వంగా భావిస్తున్నట్లు వరుణ్ స్ఫష్టం చేశారు. వీఎఫ్ఎక్స్ సాయంతో పైలట్ సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరణ జరిగిందని వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు. యువతరానికి ఈ సినిమా స్ఫూర్తిగా నిలవనుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details