ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: అల్లు అర్జున్​ అరెస్ట్​ - మధ్యంతర బెయిల్​ - ప్రత్యక్ష ప్రసారం - ALLU ARJUN IN POLICE CUSTODY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 1:20 PM IST

Hero Allu Arjun Into Custody Live : హీరో అల్లు అర్జున్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్‌ కేసులో ఆయన్న విచారించేందుకు చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్​ విధించింది. దీంతో పోలీసులు అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ నెల 4న పుష్ప-2 ది రూల్‌ సినిమా బెనిఫిట్​ షోను చూసేందుకు సంధ్య థియేటర్‌కు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అభిమానులతో పాటు ఆయన కూడా సినిమా చూసేందుకు సంధ్య థియేటర్‌కు వచ్చారు. దీంతో ఒక్కసారిగా అభిమానుకు ఎగబడ్డారు. వారందరిని చెదరగొట్టే తరుణంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన మహిళకు తీవ్రగాయలయ్యాయి. అది గమనించిన పోలీసులు ఆమెను పక్కకు తీసుకెళ్లి సీపీఆర్‌ చేసి, సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆమె మరణించారు. ఈ ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్రగాయలయ్యాయి. ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై, సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన ఇటీవలే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు.. ప్రత్యక్ష ప్రసారం 

ABOUT THE AUTHOR

...view details