ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గిరిజనలు శ్రమదానం చేశారు - దెబ్బతిన్న వంతెనకు మరమ్మతులు చేశారు - Tribals Did Bridge Repair Works - TRIBALS DID BRIDGE REPAIR WORKS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 2:23 PM IST

Tribals Did Bridge Repair Works: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై వరద చేరి జలాశయాలను తలపిస్తున్నాయి. దీంతో బయటకు రాలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోటట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో ప్రజల అవస్థలైతే వర్ణనాతీతం. అల్లూరి జిల్లాలో కురిసిన వర్షాలకు వంతెనలు తెగిపోయి గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారుల కోసం ఎదురు చూడకుండా గిరిజనులే శ్రమదానంతో వంతెన మరమ్మతులు నిర్వహించారు. 

Rains Effect Bridge Collapsed: వర్షాల ధాటికి అల్లూరి జిల్లాలోని ముంచంగిపట్టు మండలం వనుగుమ్మ పంచాయతీ తర్లగుడ వద్ద ఉన్న వంతెన దెబ్బతింది. కల్వర్టు కూడా కుంగిపోయింది. ఇప్పటికే ఈ గ్రామానికి రహదారి మంజూరైనా నేటికీ పనులు పూర్తి కాలేదు. దీంతో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులే వంతెన మరమ్మతులు నిర్వహించారు. శ్రమదానం చేసి వంతెనకు తాత్కాలికంగా మరమ్మతులు చేసి రాకపోకలను సుగమం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details