ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డెంగ్యూతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు మరణాలు :హెల్త్ కమిషనర్ - Health Commissioner Visit Tadepalli

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:55 PM IST

Health Commissioner Visit Dengue Person House (ETV Bharat)

Health Commissioner Visit Dengue Person House in Tadepalli : రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా కేసులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ హరికిరణ్ చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ రావు కాలనీలో డెంగ్యూ కేసు నమోదు కావడంతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్యశాఖ కమిషనర్ హరికిరణ్​తోపాటు ఇతర వైద్యులు, మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు కేఎల్ రావు కాలనీలో పర్యటించారు. కాలనీ వాసులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని హరికిరణ్ అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య తక్కువగానే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరి కిరణ్​ అన్నారు. ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏఎస్ఆర్ కేసులు నమోదవుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారని అన్నారు. చనిపోయిన వారు డెంగ్యూతోనేనా లేక ఇతర సమస్యలతోనా అనేది అనుమానంగా ఉందని అధికారులు చెప్పారు. డెంగ్యూ ప్రభలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యశాఖ కమిషనర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details