'ఇంటి స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ ఆక్రమించాడు' - న్యాయం చేయాలని తల్లీకుమారుడు సెల్ఫీ వీడియో - రొంపిచర్ల భూ కబ్జా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 9:28 AM IST
Head Constable Occupying Plot: ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ ఆక్రమించారంటూ ఓ తల్లీకుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఉయ్యాల శివకృష్ణ అతని తల్లికి ప్రభుత్వం ఇంటి పట్టాను కేటాయించింది. హెడ్ కానిస్టేబుల్ రమేష్ తమ స్థలాన్ని ఆక్రమించారని సెల్ఫీ వీడియోలో వారి బాధను వెళ్లగక్కారు. మూడేళ్లుగా దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీడియోలో వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో వారు వేడుకున్నారు. సమస్య పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అసహనం వ్యక్తం చేశారు.
"మా అమ్మ ఉంటున్న ఇంటిని కూడా ఆక్రమించి ఇంటికి తాళం వేశారు. ఎస్సీ దగ్గరికి వెళ్లినా, డీఎస్సీ దగ్గరికి వెళ్లినా సీఐ దగ్గరికి వెళ్లమని అంటారు. ఒక ప్రభుత్వ అధికారి చుట్టూ ప్రహరి గోడ నిర్మించారు. పట్టా కాగితాలు ఉన్నా మమ్మల్ని పక్కకు నెట్టేశారు." - బాధితుడు