LIVE : మెదక్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో హరీశ్‌రావు సమావేశం - Lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : Apr 11, 2024, 2:08 PM IST
|Updated : Apr 11, 2024, 2:58 PM IST
Harishrao meeting with Medak Lok Sabha Constituency : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమ ప్రాబల్యాన్ని చాటి చెప్పాలని గులాబీ దళం కోరుకుంటుంది. అందులో భాగంగా వరుసగా పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ పంట పొలాల పరిశీలన పేరుతో పొలం బాట పట్టి మళ్లీ ప్రజల్లోకి బీఆర్ఎస్ను తీసుకెళ్లాలని చూస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ముఖ్యనేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్‌రావు 17 పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభ్యర్థులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు నూతనోత్తేజం ఇస్తూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో హరీశ్‌రావు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Last Updated : Apr 11, 2024, 2:58 PM IST