ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నెల్లూరులో కోలాహలంగా హనుమాన్‌ శోభాయాత్ర - వేలాది మంది పాల్గొన్న భక్తులు - Hanuman Sobha Yatra - HANUMAN SOBHA YATRA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 10:33 AM IST

Hanuman Sobha Yatra in Nellore District : శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ మీదగా స్టోన్‌ హౌస్‌పేటలోని ఆర్​ఎస్​ఆర్​ (RSR) పాఠశాల వరకు యాత్ర సాగింది. శ్రీరాముడు, హనుమంతుడి విగ్రహాలను వాహనాలపై కొలువుదీర్చి ద్విచక్ర వాహనాల్లో హనుమాన్ భక్త బృందం ర్యాలీగా తరలి వెళ్లారు. అడుగడుగునా ప్రజలు దీపాలతో హారతులు ఇచ్చారు. పూలవర్షం కురిపించారు. మంగళ వాయిద్యాలు, జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణ, విచిత్ర వేషధారణలు, కోలాటాలు, ఆధ్యాత్మిక గీతాలాపనలు, బాణసంచా పేలుళ్ల మధ్య హనుమాన్​ శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో పాల్లగొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పలువురు ముస్లిం యువకులు వీఆర్సీ కూడలిలో శోభాయాత్రలో పాల్లొన్న వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మద్రాస్ బస్టాండ్ వద్ద జరిగిన ఉద్రిక్తత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు భారీగా మోహరించి యాత్ర ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details