ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రైతుల భూమి కాజేసిన ఎమ్మెల్యే- బాధితుల నిరసనకు టీడీపీ నేతల మద్దతు - Land Kabja by guntur Mla

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 3:48 PM IST

Guntur MLA Kilari Occupied Farmers Land : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో గత 40 ఏళ్లుగా 22 ఎకరాల భూమిలో పంటలు పండిస్తున్నామని రైతులు (Farmers) చెప్పారు. ఈ భూములను స్థానిక శాసనసభ్యులు కిలారి రోశయ్య (Kilari Rosaiah) అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. గతంలో ఈ భూములను కాజేసేందుకు ఎత్నించగా తామంతా న్యాయస్థానానికి వెళ్లి వాటిని కాపాడుకున్నామని నాయకులు చెప్పారు.

కొంతమంది తప్పుడు సంతకాలతో న్యాయస్థానానికి వెళ్లి ఎమ్మెల్యే  ఆ పిటిషన్ కొట్టేయించుకున్నారన్నారు. దీంతో ఆ భూమిని అధికారులు డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డీనోటిఫై ఉత్తర్వులు రాగానే ఎమ్మెల్యే తన ప్రధాన అనుచరుడు, పెదకాకాని శివాలయం చైర్మన్ అమ్మిశెట్టి శంకరరావు కుమారులు, కోడళ్ళ పేరుతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆన్లైన్లో ఎమ్మెల్యే (MLA) అనుచరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్త్రాలు కనిపించకుండా అధికారులు వాటిని దాచేశారని నాయకులు ఆరోపించారు. వాటిని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details