ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అర్ధరాత్రి వైఎస్సార్సీపీ సర్పంచ్‌ హల్​చల్ - ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన - YSRCP Sarpanch Halchal - YSRCP SARPANCH HALCHAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 1:09 PM IST

Gundlapalli YSRCP Sarpanch Purushottam Halchal in Anantapur District : ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ రోజు, అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తమ పార్టీకి ఓటు వేయని అమాయక ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులు చేస్తునే ఉన్నారు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అన్నట్టు... అగ్ర నాయకులను ఆదర్శంగా తీసుకున్న కొంత మంది గ్రామ నాయకులు అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. వారికి అడ్డువచ్చిన పోలీసులను సైతం లెక్కచేయడం లేదు. ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

బెలుగుప్ప మండలం గుండ్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్‌ పురుషోత్తం అర్ధరాత్రి కారులో వీధుల్లో తిరుగుతూ హల్ చల్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకోగా, వారిపైనా దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గ్రామస్థుల ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ సర్పంచ్‌ పురషోత్తంను పోలీసులు బైండోవర్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details