త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం - మహారాష్ట్రకు రాకపోకలు బంద్ - Godavari River Flow - GODAVARI RIVER FLOW
Published : Sep 3, 2024, 4:24 PM IST
Godavari River Flow: రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరద ప్రవాహం పెరుగుతోంది. తెలంగాణ- మహారాష్ట్ర మధ్య ఉన్న బ్రిడ్జిని ఆనుకుని ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేసారు. ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపునకు రావొద్దని హెచ్చరించారు. ఈ వర్షాలకు ప్రభావితం అయిన జిల్లాలను ముఖ్యమంత్రి పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.
భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపుగా రూ. 5వేల కోట్ల పై చిలుకు నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తెలంగాణకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. విజయవాడ కంటే ఖమ్మంలోనే ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడే వారి దగ్గరకు వెళ్లాలని, వారు సుఖంగా ఉంటే నాయకుడు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.