ఎన్నికల బాండ్ల తీర్పుపై మోదీ ఇప్పుడేమంటారు ?: చింతా మోహన్ - Chinta Mohan criticized Modi
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 3:59 PM IST
Former Union Minister Chinta Mohan Criticized Modi : ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఉద్వేగానికి లోనయ్యారు. దేశ చరిత్రలో ఫిబ్రవరి 15 మరుపురాని రోజని తెలిపారు. తీర్పు వెలువరించిన ఐదుగురు జడ్జీలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో మద్దతు ఉందని చట్టాలను, పీపుల్స్ రెప్రజెంటేటివ్ యాక్ట్, కంపెనీ చట్టాలను బీజేపీ ఇష్టానుసారంగా మార్చిందని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం తీరుపై ప్రధాని మోదీ ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు ? రాజ్యాంగ నిర్మాతలు వేసిన పూనాదులు దృఢంగా ఉన్నాయనడానికి సుప్రీం కోర్టు తీర్పు నిదర్శనమన్నారు.
ఒక్క తీర్పుతో దేశంలోని అన్ని సంస్థలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసున్న మోసాలను కోర్టు గుర్తించిందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో దొంగలు అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని తెలిపారు.