ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొనసాగుతున్న చిరుత వేట - డ్రోన్‌ కెమెరాలతో నిఘా - Leopard In Kadiyam Nursery - LEOPARD IN KADIYAM NURSERY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 1:33 PM IST

Leopard Spotted Kadiyam Nurseries :  తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్నిరోజులుగా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తొలుత రాజమహేంద్రవరం సమీప దివాన్‌చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత తాజాగా కడియం, గోదావరి లంకల్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే లంక గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అది ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నరు. 

మరోవైపు అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమవుతూ ప్రజలకు సూచనలు జారీచేస్తున్నారు. దాని ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాలు వినియోగిస్తున్నారు. దానిని నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చెప్పారు. ఇప్పటికే పాదముద్రలు గుర్తించామని తెలిపారు. చిరుత మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశముందని పేర్కొన్నారు. చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్‌ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. 

DFO Bharani on Leopard Roaming : సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత గురించి ఏదైనా విషయం తెలిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ చేస్తున్న చర్యలపై తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో భరణితో మా ప్రతినిధి సాయికృష ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details