నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో పెద్దపులి, చిరుతల సంచారం - forest department officer interview
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 4:43 PM IST
Forest Department Officer Interview: పెనుశిల అభయారణ్యంలో పెద్దపులి, చిరుతపులులు సంచారం చేస్తున్నాయని ఫారెస్ట్ నిఘా కెమెరాల్లో గుర్తించారు. జీవావరణంలో పులులు, వన్యప్రాణులను సంరక్షించాల్సిన అవసరం ఉందని అటవీ అధికారులు తెలిపారు. పులుల కదలికలను పర్యవేక్షించేందుకు 30 మంది అటవీశాఖ సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. గత రెండేళ్ల నుంచి ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు చెప్పారు.
రెండు నెలల కిందట ఎక్కువగా నిఘా కెమెరాల్లో గుర్తించినట్లు తెలిపారు. జింకలు, దుప్పులు వంటి వందలాది వన్యప్రాణులు ఉన్నట్లు వివరించారు. వన్యప్రాణుల సంరక్షణకు నీటి కుంటలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు ఇంత పెద్ద అభయారణ్యాన్ని టైగర్ కారిడార్‌గా మారుస్తామనే ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయి, వన్య ప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న ఇతర చర్యలు, పులులు జన సంచారంలోకి రాకుండా తీసుకుంటున్న చర్యలపై నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.