శ్రీకాకుళం ఎన్నికల బరిలో మత్స్యకార దంపతులు- భర్త ఎంపీగా, భార్య ఎమ్మెల్యేగా పోటీ - Fish Business Couple in Elections - FISH BUSINESS COUPLE IN ELECTIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 4:41 PM IST
Fish Business Couple in Elections From Navrang congress Party : చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతులు ఎన్నికల బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా బసివలసకు చెందిన కాయ దుర్గారావు, ఆయన భార్య కామేశ్వరి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి దుర్గారావు, అసెంబ్లీ స్థానానికి కామేశ్వరి బరిలో నిలిచారు. అయితే రోజూ ఉదయం తమ స్వగ్రామం నుంచి నరసన్నపేటకు వెళ్లి చేపలు విక్రయించేవారు. గత 2నెలలుగా సముద్రం వేట నిషేధం కారణంగా వ్యాపారం స్తంభించిపోయింది.
ఈ క్రమంలోనే ఎన్నికలు రావడంతో భార్యాభర్తలిద్దరూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుభవం లేకున్నా వీరిద్దరూ బకెట్ ఎన్నికల గుర్తుతో ప్రచారం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. చెప్పులు కుట్టే వ్యక్తుల నుంచి చేపలు పట్టే వారి వరకు ఎన్నికల బరిలో నిలిచి స్వతంత్రులుగా ముందుకొస్తున్నారు.