వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం - ఫర్నిచర్ షాపులో చెలరేగిన మంటలు - Fire accident in warangal - FIRE ACCIDENT IN WARANGAL
Published : Aug 27, 2024, 11:58 AM IST
Fire Accident At Wanrangal Today : వరంగల్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించడంతో ఫర్నీచర్ షాపు పూర్తిగా దగ్ధమైంది. దుకాణంలోని ఫర్నిచర్ల తో పాటు గోదాంలోని ఫర్నిచర్లు కూడా అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటనతో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : "నగరంలోని సాకరాశికుంటలోని పాత ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తేలింది. సమాచారం అందగానే రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాం. గతంలో ఇదే ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురై ఐదు ఫర్నిచర్ దుకాణాలు తగలబడినట్లు స్థానికులు తెలిపారు. ఇరుకు ప్రదేశాల్లో ఫర్నిచర్ దుకాణాలను ఏర్పాటు చేయడంతోనే అగ్నిప్రమాదం జరిగిన ప్రతిసారీ భారీ మొత్తంలో నష్టం జరుగుతోంది." ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. అని పోలీసులు తెలిపారు.