ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జస్టిస్ దుర్గాప్రసాద్ పదవీ విరమణ- హైకోర్టులో ఘనంగా వీడ్కోలు - Justice DurgaRao Retire on Aug 11 - JUSTICE DURGARAO RETIRE ON AUG 11

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 11:22 AM IST

Farewell to High Court Judge Justice Upmaka Durga Prasad Rao : హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్​రావుకు హైకోర్టు ఘన వీడ్కోలు పలికింది. ఆయన ఈ నెల 11న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరు మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ దుర్గా ప్రసాదరావు అందించిన న్యాయసేవలను హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ గుర్తు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా 16వేలకు పైగా కేసులను పరిష్కరించి కీలక తీర్పులిచ్చారని అన్నారు. జస్టిస్ దుర్గా ప్రసాద్ పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ఆకాంక్షించారు. జస్టిస్ దురా ప్రసాదరావు దంపతులను న్యాయమూర్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు జస్టిస్ దుర్గా ప్రసాదరావుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details