ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది - లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యం: టీడీపీ నేత నారాయణ - TDP LEADER PONGURU NARAYANA - TDP LEADER PONGURU NARAYANA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 1:19 PM IST

F2F With TDP Leader Ponguru Narayana in Nellore District : నెల్లూరు నగర నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీనే లక్ష్యమని తెలుగుదేశం అభ్యర్థి పొంగూరి నారాయణ చెబుతున్నారు. గతంలో మంత్రిగా చేసిన నగర అభివృద్ధి పనులే తనకు విజయాన్ని ప్రజలు కట్టబెడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు.

నియోజకవర్గంలో సొంత ఇళ్లు లేని పేదలను పిలిచి ఇంటి స్థలాలను ఇస్తామని నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరును దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. నగరవాసులకు తాగునీటి సరఫరా, అన్న క్యాంటీన్లు రీ ఓపెన్​ చేయించాలని తన భవిష్యత్తు కార్యాచరణను తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెల్లూరు జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి పొందే యువతకు బ్యాంక్​ రుణాలు, ఇతర ప్రోత్సాహకాలపై దృష్టి పెట్టుతామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రజలంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details