టెక్నాలజీని సమ్మిళితం చేస్తూ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తాను : కొండపల్లి శ్రీనివాస్ - New Minister Kondapalli Srinivas - NEW MINISTER KONDAPALLI SRINIVAS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 12:47 PM IST
F2F With New Minister Kondapalli Srinivas in Vizianagaram District : కొండపల్లి శ్రీనివాస్ ఈ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా మంత్రి పదవిని సొంతం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మంత్రి పదవి చేపట్టాక ఆయన ముందు ఉన్న సవాళ్లేంటి విజయనగరం జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారు. ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తారో ఈభారత్తో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజకీయల్లోకి వచ్చానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తమ అధినేత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాను అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని తెలియజేశారు. మంత్రిగా బాధ్యతగా పనిచేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించి వలసలు అరికట్టడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమ్మిశితం చేస్తూ గ్రామీణ, నగర అభివృద్ధి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, ఆరోగ్యం, విద్య లాంటి మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు.