అన్నిచోట్ల వైఎస్సార్సీపీ దోపిడీ - లేదని చెప్పే ధైర్యం వారికి ఉందా?: బుద్దా వెంకన్న - Buddha Venkanna Comments on YSRCP - BUDDHA VENKANNA COMMENTS ON YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 1:44 PM IST
EX MLC Buddha Venkanna Comments on YSRCP : వైఎస్సార్సీపీ హయాంలో దండుపాళ్యం బ్యాచ్ నడిచిందని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పలానా శాఖలో దోచుకోలేదని చెప్పే దమ్ము, ధైర్యం వైఎస్సార్సీపీ నేతలకు ఉందా అని నిలదీశారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారన్న బుద్దా వెంకన్న, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూలు కట్టబోతున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అదోగతిపాలు చేసిందని, ఒక్క పరిశ్రమ లేదు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. ప్రతి పథకంలో, ప్రతి కార్యక్రమంలో దోపిడీ తప్పనిసరి అన్నట్లు వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి కూడా చెయ్యలేదు. రైతు పరిహారాలను సైతం ఇవ్వకుండా అర్హులైన రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు వారికి తగిన బుద్ది చెప్పారని అన్నారు.