వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది : చింతా మోహన్ - Chinta Mohan Sensational Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2024, 3:24 PM IST
Chinta Mohan Sensational Comments On Ys Jagan : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా రావాలన్నారు. తిరుపతిలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తనపై వచ్చిన ఒత్తిళ్ల కారణంగా తిరుపతి రాజధాని అంశాన్ని పక్కన పెట్టామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. అదేవిధంగా స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి ఉచిత దర్శనం కల్పించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
మెున్న జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి దాదాపుగా రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టాడని విమర్శించారు. ఈ అక్రమ డబ్బుని పోలీసులను ఉపయోగించుకుని పంచారని మండిపడ్డారు. అసలు ఇంత డబ్బును ఎక్కడి నుంచి సేకరించాడో అర్ధం కావటం లేదన్నారు. ఇలాంటి వ్యక్తులను పద్మ అవార్డులతో సత్కరించాలని ఎద్దేవా చేశారు.