ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు నమోదు అవగాహన సదస్సులు - ఈనాడు ఈటీవీ ఓటు అవగాహన సదస్సు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 8:56 AM IST
EENADU-ETV Will Conduct Vote Registration Awareness: ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు నమోదు అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. నెల్లూరులోని బొల్లినేని నర్సింగ్ కళాశాలలో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు లేని విద్యార్థులు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు వినియోగించుకొని మంచి నాయకున్ని ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ రావు అండ్ నాయుడు ఇంజినీరింగ్ కళాశాలలో ఓటు అవగాహన సదస్సు జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సూచించారు. కర్నూలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఓటు అవగాహన సదస్సుకు ఎన్నికల నోడల్ అధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ఓటు ప్రాధాన్యతను వివరించారు. మంచి నాయకున్ని ఎన్నుకోవాలంటే చదువుకున్న యువత ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎక్కువ శాతం మంది యువత ఓటింగ్లో పాల్గొనాలని ఎన్నికల నోడల్ అధికారి రమణ పిలుపునిచ్చారు.
ఓటు అనేది ప్రతి ఒక్కరి ఆయుధం. మంచి నాయకున్ని ఎన్నుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఓటు అనేది కీలకం అవుతుంది. -రమణ, ఎన్నికల నోడల్ అధికారి