ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష - Nara Lokesh Review On Skill census

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 10:39 PM IST

రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష (ETV Bharat)

Education Minister Nara Lokesh Review On Skill Census : రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్ల పై నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధితో యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేయలని నిర్ణయించారు. అలాగే స్కిల్ సెన్సెస్ లో వివిధ ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేసేలా విధివిధానాల రూపకల్పన పై చర్చించారు. ఏపీఎస్ఎస్​డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పై అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

అలాగే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆరోపించారు. వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం బదిలీలు చేపడతామని, ప్రజాదర్బార్‌లో తనను కలిసిన ఉపాధ్యాయులకు స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీ ఉత్తర్వులు పొంది, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని టీచర్లు లోకేశ్​కు విజ్ఞప్తి చేశారు. టీచర్ల బదిలీల్లో తాను చెడ్డపేరు తెచ్చుకోదల్చుకోలేదని ఈ సందర్భంగా లోకేశ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details