ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాయిలాలతో బయలుదేరిన వైఎస్సార్సీపీ వాహనం- పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్! - EC Flying Squad seized ycp lorry - EC FLYING SQUAD SEIZED YCP LORRY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 9:43 PM IST

EC Flying Squad seized a lorry of YSRCP propaganda materials from CWC warehouses : తిరుపతి జిల్లా రేణిగుంటలోని సీడబ్ల్యూసీ (CWC) గోదాముల వద్ద వైఎస్సార్సీపీ ప్రచార సామాగ్రికి సంబంధించిన ఓ లారీని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. లారీలో ఉన్న వైఎస్సార్సీపీ టోపీలు, టీ- షర్టులు, జెండాలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. CWC గిడ్డంగిలో ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి కుక్కర్లు సహా ఇతర సామాగ్రి ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వైఎస్సార్సీపీ నేతలు యత్నిస్తున్నారనీ తెలిపారు. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

ఓ వైపు ఎన్నికల కోడ్​ వచ్చినా అధికార పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ప్రచారాలు, ప్రజల్ని ప్రలోభ పెట్టే పనులు మాత్రం మానుకోవడం లేదు. ప్రచారాల విషయమై ఎన్నికల అధికారులు వాలెంటీర్ల మీద కొరడా ఝులిపించినా వైఎస్సార్సీపీ కార్యకర్తల, పార్టీకి కొమ్ము కాస్తున్న కార్యకర్తల తీరు మారడం లేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details