ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల చేసేవారిపై కఠిన చర్యలు: డీజీపీ ద్వారకా తిరుమలరావు - DGP Orders to SP - DGP ORDERS TO SP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 10:21 AM IST
DGP Orders to Take Strict Action Against Government Employees Attack Cases : ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసేవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరి మూకలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటివారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) గత నెలలో డీజీపీకి వినతిపత్రం అందజేసింది. ఈ విజ్ఞప్తి మేరకు డీజీపీ తాజాగా ఆదేశాలిచ్చారు. దీనిపై ఎన్ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై. శ్రీనివాసరావు, యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు
కొందరు ఖజానా అధికారులు వివిధ డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు భత్యాలు నిలిపేశారని ఎన్ఎంయూఏ నేతలు తెలిపారు. దీనిపై తగిన ఆదేశాలివ్వాలని కోరుకున్నారు. ఈ మేరకు ఖజానాశాఖ సంచాలకునికి వినతిపత్రం అందజేశారు. జీతాలతోపాటు, భత్యాలు ఇచ్చేలా అధికారులందరికీ అదేశాలిస్తామని సంచాలకులు హామీ ఇచ్చినట్లు ఎన్ఎంయూఏ నేతలు తెలిపారు.