ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పోలీస్‌ అమరవీరుల దినోత్సవం - ప్రత్యేక కార్యక్రమాలకు ప్లానింగ్ : డీజీపీ - POLICE COMMEMORATION DAY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 5:41 PM IST

DGP on Police Commemoration Day : పోలీసు ఉద్యోగం అంటే కష్టాలు, సవాళ్లు ఎదుర్కొనే ఉద్యోగమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. విధినిర్వహణ లో సంక్లిష్ట పరిస్థితులు, అవమానాలు, దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రాణాలను సైతం త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. 

1959 లో చైనా సరిహద్దుల్లో ఆర్.పి.ఎఫ్ అధికారి కరంసింగ్ పై దుండగులు దాడి చేసి మట్టుపెట్టగా పాతికేళ్ల క్రితం  1100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సరిహద్దులో అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ అక్టోబర్ 31 న సంస్మరణ దినం జరుపుకుంటున్నామని  డీజీపీ వెల్లడించారు. అక్టోబర్ 21 నుంచి 31 వ తేదీ వరకు సంస్మరణ దినోత్సవాలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు.  

సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా అమర వీరుల కుటుంబాలను సీనియర్ అధికారులతో పరామర్శించే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పాఠశాలల్లో పోలీసు విధులపై అవగాహన కార్యక్రమాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమం చేపట్టడంతో పాటు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు  తెలిపారు. రక్త దాన శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details