శవ రాజకీయాలను వైసీపీ పేటెంట్ హక్కుగా భావిస్తుంది: ఉమామహేశ్వరరావు - Devineni Umamaheswara Rao - DEVINENI UMAMAHESWARA RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 5:02 PM IST
Devineni Comments on Pension Issues: ఫించన్ మరణాలకు కారణం ముమ్మాటికీ జగన్మోహన్ రెడ్డే అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శవ రాజకీయాలకు సీఎస్ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈవో, ధనుంజయ్ రెడ్డి, శశిభూషణ్లు సహకారం అందించారని మండిపడ్డారు. ఐఏఎస్ చదువులు చదివింది పండుటాకులపై పగబట్టి వారి చావులు చూసేందుకేనా అని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న సజ్జల రాజకీయాలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వైసీపీ శవ రాజకీయాలకు పేటెంట్ హక్కుగా పొందిందని దుయ్యబట్టారు. ఫించన్ డబ్బును అస్మదీయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ఆరోపించారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఇప్పటికీ ఇంకా వైసీపీ నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఐదు సంవత్సరాల్లో సలహాదారు పేరుతో కోట్లు తిన్నారని తెలిపారు. సజ్జల ప్రభుత్వ సొమ్ము తింటూ వైసీపీ ప్రభుత్వంతో అంటకాగుతున్నాడని విమర్శించారు. సలహాదారుగా పని చేసే సజ్జలకు రాజకీయాలు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. వైసీపీ తరఫున మాట్లాడాలంటే సలహాదారు పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా, సీఎస్, సెర్ఫ్ సీఈవో, ధనుంజయ్ రెడ్డి, శశిభూషణ్లు పింఛన్ పంపిణీ విషయంలో వైసీపీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.