ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో ఫేక్ ఫ్యాక్టరీ: దేవినేని - DEVINENI ON FAKE NEWS - DEVINENI ON FAKE NEWS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 4:37 PM IST

Devineni Uma Allegations on Sajjala Bhargava Reddy:  సజ్జల భార్గవరెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలో ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిలోని నెక్స్ట్ స్పేస్ భవనంలో ఫేక్ వార్తల్ని ఆ పరిశ్రమలో సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఫేక్ లోగోలు కూడా ఈ భవనం కేంద్రంగా రూపొందిస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. 

 సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయంపై డీజీపీ, ఎన్నికల అధికారులు రైడ్ చేసి ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోవాలని దేవినేని దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao) డిమాండ్‌ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో కు చెందిన ఫేక్ లోగోను సృష్టించి జాతి ద్రోహానికి వైసీపీ పాల్పడిందని ఆరోపించారు. జాతి భద్రతకు సంబంధించిన ఈ అంశంపై తీవ్రమైన కేసులు నమోదు చేయాలని ఈసీ, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దాదాపు 300 మందికి ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తూ ఫేక్ వీడియోలు, పత్రాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details