LIVE : బెంగళూరులో పవన్ కల్యాణ్ పర్యటన - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan Bangalore Tour - PAWAN KALYAN BANGALORE TOUR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 1:20 PM IST
|Updated : Aug 8, 2024, 1:40 PM IST
Pawan Kalyan Bangalore Tour Live : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు, సమావేశాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అధికారులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలుపరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్ధ పనిచేయదన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్ధ ఖచ్చితంగా పని చేస్తుందని చెప్పారు. చంద్రబాబు నుంచి పాలన అనుభవం నేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ వివరించారు.ఎన్డీయే ప్రభుత్వం అకౌంటబులిటీ ఉన్న ప్రభుత్వమని పవన్ కల్యాణ్ తెలిపారు. పాలకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్ల పాలన తెలియజేసిందని వివరించారు. మరోవైపు విభజన వల్ల అందరం అవమానాలు పడ్డామని, చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. వాటన్నింటిని లక్ష్య పెట్టకుండా ముందకు వెళ్లామని వెల్లడించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగ పడుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. తాజాగా పవన్ కల్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు.
Last Updated : Aug 8, 2024, 1:40 PM IST