ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి- ముందస్తు జాగ్రత్తలపై పవన్‌ సమీక్ష - Deputy CM Pawan Review on Health - DEPUTY CM PAWAN REVIEW ON HEALTH

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 4:58 PM IST

Deputy CM Pawan Kalyan Review on Prevention of Seasonal Diseases: ‍‌‍‌రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తి నిరోధం, ముందస్తు జాగ్రత్తలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వ్యవహరంపై అధికారులను నిలదీశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం, స్థానిక సంస్థలకు చెందాల్సిన నిధులను సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎంత మేర మళ్లించారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

తాగునీటి సరఫరాలో లోపాల వల్ల విజయవాడలో డయేరియా కేసులు ఉత్పన్నమయ్యాయని పవన్‌ అభిప్రాయపడ్డారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి తక్షణం నియంత్రణ విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు, తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details