ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కొండపల్లి కళాకారులకు పవన్​ శుభవార్త - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం - KONDAPALLI DOLLS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 12:19 PM IST

Deputy Chif Minister Pawan kalyan Orders For Kondapalli Dolls : ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరకు అయిన అంకుడు, తెల్లపొణి చెట్లను విస్తారంగా పెంచాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. బొమ్మల తయారీదారులు కర్ర లభ్యత కొరతగా ఉందన్న విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు, తెల్ల పొణికి చెట్లు పెంచాలని పవన్​ అధికారులకు సూచించారు. 

ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో అంకుడు, తెల్లపొణి చెట్లు పెంపకంపై దృష్టి సారించాలని అధికారులను పవన్ ఆదేశించారు. పవన్​ కల్యాణ్​ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకొని కనీసం రెండు మూడు తరాలకు సరిపడా అంకుడు, తెల్ల పొణికి చెట్లను పెంచేలా పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్త కళలను ప్రోత్సహించే దిశగా పవన్ పలు చర్యలు తీసుకొంటున్నారు. రాష్ట్ర అతిథులను సత్కరించే సందర్భంలో కళాకారులు తీర్చిదిద్దిన కళాకృతులను వారికి బహుమతులుగా అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details