LIVE: పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - PAWAN KALYAN PITHAPURAM VISIT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 10, 2025, 2:20 PM IST
Pawan Kalyan Pithapuram Visit: పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లు పవన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో జరుగుతున్న సభకు పవన్ హాజరయ్యారు. అంతకు ముందు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట వద్ద ఈనెల నాల్గున జరిగిన రోడ్డు ప్రమాదం ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా రాజమండ్రి, కాకినాడ మధ్య ప్రమాదకరంగా మారిన ADB రోడ్డుపై ఇద్దరు యువకులు మృతిచెందారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న సమయంలో పనన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు రాజమహేంద్రవరం నుంచి పిఠాపురంకు జాతీయ రహదారి మీదుగా కాకుండా ప్రమాదకరంగా ఉన్న ADB రోడ్డుపై పవన్ ప్రయాణించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. తూర్పుగోదావరి కాకినాడ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు ప్రమాదం జరిగిన వివరాలను పవన్‌కు వివరించారు. ప్రస్తుతం పిఠాపురంలోని సభలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం